Nani Shyam Singha Roy Movie Deleted Scene Released - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy :పెళ్లి చేసుకొమని అడిగిన వేశ్యకి నాని ఏం చెప్పారంటే..

Jan 22 2022 4:09 PM | Updated on Jan 22 2022 5:08 PM

Nani Shyam Singha Roy Movie Deleted Scene Released - Sakshi

నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న విడుదలై..  బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన శ్యామ్‌ సింగరాయ్‌.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకెళ్తుంది. నిన్నటి(జనవరి 21)నుంచి  ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
(చదవండి: నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఫోటో వైరల్‌)

ఇదిలా ఉంటే.. శనివారం ఈ సినిమాలోని ఓ డిలీటెడ్‌ సీన్‌ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో నాని.. వేశ్యల దగ్గరకు వెళ్లి.. వారి వృత్తి గురించి తాను రాసిన లైన్స్‌ను చెప్పగా... ఇంత తెలిసినవాడివి.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ఓ వేశ్య అడుగుతుంది. దానికి నాని 'ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు' అని బదులిస్తాడు. ప్రస్తుతం ఈ డిలీటెడ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement