ఐపీఎల్ సందడి మామూలుగా ఉండదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే తెలుగువారికి పూనకాలే. అది కూడా హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగితే ఆ జోష్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని ఉన్న సీఎస్‌కే టీమ్‌తో మ్యాచ్ అంటే క్రేజ్ వేరే లెవెల్. ఈ క్రేజీ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే తలపడగా.. హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు సాంగ్స్ క్రికెట్ ప్రియులను ఊర్రూతలుగించాయి. ముఖ్యంగా నాని మూవీ ప్యారడైజ్ సాంగ్ స్డేడియాన్ని ఊపేసింది. ఈ మ్యాచ్ మధ్యలో పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ అనే పాటను ప్లే చేశారు. ఈ పాటకు ఫ్యాన్స్‌కు ఏకంగా పూనకాలతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ప్యారడైజ్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉప్పల్ రోర్స్ విత్ ఆయా షేర్ మానియా అంటూ వీడియోను పంచుకుంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో కేవలం తెలుగులోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
కాగా.. నాని హీరోగా వస్తోన్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సూపర్‌హిట్‌గా నిలిచింది. మరోసారి వీరిద్దరు కలిసి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న రిలీజ్ కానుంది.
Nannu peekuthava...
Jumbalikay aayasher 💥💥
Uppal Stadium roars with #AayaSher mania🧡 pic.twitter.com/T9WIePBKzN— THE PARADISE (@TheParadiseOffl) April 18, 2026


