నానీకి నాన్న క్లాప్‌ | Nani New Movie Shyam Singha Roy Launch | Sakshi
Sakshi News home page

నానీకి నాన్న క్లాప్‌

Dec 11 2020 5:36 AM | Updated on Dec 11 2020 5:36 AM

Nani New Movie Shyam Singha Roy Launch  - Sakshi

కృతీ శెట్టి, సాయి పల్లవి, నాని, గంటా రాంబాబు

నాని హీరోగా, సాయిపల్లవి, కృతీ శెట్టి (‘ఉప్పెన’ ఫేమ్‌) హీరోయిన్లుగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ ఎస్‌. బోయిన్‌పల్లి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ను అందించగా, నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుందని సమాచారాం. ‘‘త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందకు తీసుకొస్తాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమటం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ.జె. మేయర్‌.

Advertisement
 
Advertisement
Advertisement