ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం: నాగ చైతన్య

Naga Chaitanya Officially Confirms Divorce with Samantha - Sakshi

ChaySam Divorce: నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. తాము విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా సమంత ప్రకటించింది. ఇదే విషయాన్ని నాగచైతన్య కూడా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

‘మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. దశాబ్ద కాలంగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’అని నాగచైతన్య ట్వీట్‌ చేశారు.

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top