
ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకుంటే స్టార్ హీరోహీరోయిన్లకు జరిగే నష్టమేమీ ఉండదు. అయితే అభిమానులు ఆ సమయంలో కాస్త నిరాశపడతారు. హీరోహీరోయిన్లు మాత్రం వాటిని అధిగమించి పోతుంటారు. కమల్ హాసన్( Kamal Haasan) వంటి వారైతే ఇలాంటివి ఇంతకుముందు చాలా చూసి ఉంటారు. ఆయన సమీపకాలంలో నటించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తరువాత ఆయన నటించిన ఇండియన్–2, థగ్‌లైఫ్ చిత్రాలు ప్రేక్షుకుల అంచనాలను అందుకోలేకపోయాయి.
కాగా ప్రస్తుతం ట్విన్స్ స్టంట్‌మాస్టర్స్ అన్బరివ్‌లను దర్శకులుగా పరిచయంచేస్తూ కమల్ తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈచిత్రం ద్వారా ఆయన ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయనున్నారు. ఇందులో కమల్ సరసన నటించనున్న హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్ దృష్టిలో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur) పడే ప్రయత్నం చేశారు. హిందీ, మరాఠి, తెలుగు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇంతకుముందు తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె మార్కెట్ డల్ అయ్యింది.
మళ్లీ కోలీవుడ్‌లో మిస్ అయిన అవకాశాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తమకు నచ్చిన కథానాయకులతో జతకట్టాలని ఆశిస్తుంటారు. అలా మృణాల్‌ఠాకూర్ కమలహాసన్ సరసన నటించాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ కమల్‌తో కలిసి నటించాలని ఎంతగానో ఆశపడుతున్నానని పేర్కొన్నారు. కమల్‌తో కలిసి స్టెప్స్ వేయాలని ఆశపడుతున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. ఈ వార్త నటుడు కమల్ దృష్టికి వెళితే ఆమె కలను నెరవేరుస్తారా చూడాలి.