Pushpa Movie Mother Character Kalpalatha Unknown Facts - Sakshi
Sakshi News home page

Pushpa Movie: పుష్ప సినిమాలో అమ్మ పాత్ర.. ఆమెకు అవకాశం ఎలా వచ్చిందంటే?

Oct 26 2022 8:34 PM | Updated on Dec 8 2022 12:56 PM

Mother Character Kalpalatha In Pushpa Movie Unknown Facts - Sakshi

ఐకాన్ స్టార్ బన్నీ, రష్మిక మందన్నా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. బన్నీ అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం పంచుకుంది చిత్రబృందం. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కు అమ్మ పాత్రలో నటించి మెప్పించింది ఎవరో తెలుసా? అచ్చం చిత్తూరు యాసలో మాట్లాడి అభిమానులను సొంతం చేసుకున్న ఆమె గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

ఈ చిత్రంలో మరింత ఫేమస్ అయిన ఆమె పేరు కల్పలత గార్లపాటి. ఆమెను ప్రేక్షకులు టాలీవుడ్ సినిమాల్లో చూడడం చాలా అరుదు. కేవలం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే పరిచయమైన కల్పలత పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు సాధించింది కల్పలత. పుష్ప సినిమా ఆడిషన్స్ జరుగుతుంటే తాను కూడా వెళ్లింది.

అందరిలాగే ఆడిషన్స్‌లో పాల్గొంది. అచ్చం చిత్తూరు యాసలో మాట్లాడడం కష్టంగా అనిపించినా ఎలాగోలా ప్రయత్నించానని తెలిపింది. ఆడిషన్స్ జరిగిన  ఆర్నేళ్లకు పుష్పలో అవకాశం వచ్చిందని ఫోన్ వచ్చినట్లు పేర్కొంది. అమ్మ పాత్ర రావడంతో తనకి కొడుకులు లేని లోటు ఈ సినిమాతో తీరిపోయిందని చెబుతోంది కల్పలత గార్లపాటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement