అరుణాచలంలో అన్నదానం చేసిన హీరోయిన్‌ | Mirnalini Ravi Food Distribution to 1000 people in Tiruvannamalai | Sakshi
Sakshi News home page

వెయ్యి మందికి అన్నదానం చేసిన హీరోయిన్‌

Apr 4 2026 3:26 PM | Updated on Apr 4 2026 4:09 PM

Mirnalini Ravi Food Distribution to 1000 people in Tiruvannamalai

హీరోయిన్‌ మృణాళిని రవి మంచి మనసు చాటుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో అన్నదానం చేసింది. దాదాపు వెయ్యిమంది భక్తులకు భోజనం పెట్టింది. మృణాళిని రవి మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలన్న సేవాతత్వాన్ని మా నాన్న నేర్పించాడు.  వీలైనప్పుడల్లా ఇతరులకు సాయం చేసేలా నా పేరెంట్స్‌ నన్ను ప్రోత్సహించారు. అన్నిదానాల్లోకెల్లా అన్నదానమే గొప్పదని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. అందుకే నాకు తోచినంత చేశాను అని చెప్పుకొచ్చింది.

సినిమా
సినిమాల విషయానికి వస్తే.. మృణాళిని రవి 'సూపర్‌ డీలక్స్‌' చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 'గద్దలకొండ గణేశ్‌' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు', 'మామా మశ్చీంద్ర' సినిమాల్లో మెరిసింది. తెలుగులో కన్నా తమిళంలోనే అనేక సినిమాలు చేసింది. చివరగా 'రోమియో' అనే తమిళ చిత్రంలో తళుక్కుమంది.

చదవండి: ఈ ధురంధర్‌ నటుడికి టిఫిన్‌ చేసే అలవాటే లేదు

Advertisement
 
Advertisement
Advertisement