'భగ భగ భగ మండే.. మగాడు వీడే'.. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ అవుట్ | Sakshi
Sakshi News home page

Waltair Veerayya Title Song: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ చూసేయండి

Published Mon, Dec 26 2022 7:02 PM

Megastar Chiranjeevi Waltair Veerayya Title Song Release Today - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను రిలీజ్‌ చేసిన చిత్రబృందం తాజాగా హైలెట్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని  టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని ఇప్పటికే బాస్‌ పార్టీ సాంగ్, 'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. ' అ’నే పాటలు రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నాయి. జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. ఇప్పటికే రిలీజైన పాటలు సినిమాపై క్రేజ్ మరింత పెంచాయి. తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్‌తో సినిమాపై మరింత హైప్ పెరగనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement