అలాంటి సినిమాలే చేస్తున్నావని నాపై ట్రోల్స్: యంగ్ హీరో | Manikandan Interview And Bored Doing Middle Class Movies | Sakshi
Sakshi News home page

Manikandan: మిడిల్ క్లాస్ మూవీస్ చేసి చేసి బోర్ కొట్టేసింది

Jun 2 2025 7:11 PM | Updated on Jun 2 2025 7:32 PM

Manikandan Interview And Bored Doing Middle Class Movies

ఇండస్ట్రీలో కొందరు హీరోలు కొన్ని జానర్ సినిమాలతో ఫేమస్ అవుతారు. అలా కొన్నాళ్ల పాటు సదరు హీరో నుంచి ఒకే తరహా మూవీస్ వస్తాయి. విసుగెత్తిపోయిన ప్రేక్షకులు విమర్శించడం లాంటివి చేస్తే రూట్ మారుస్తారు. ఇప్పుడు సేమ్ అలాంటి అనుభవమే తనకు ఎదురైందని ఓ యంగ్ హీరో చెప్పుకొచ్చాడు. మిడిల్ క్లాస్ మూవీస్ చేసిచేసి బోర్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఏంటి సంగతి?

తమిళ ఇండస్ట్రీలో రైటర్‌గా కెరీర్ మొదలుపెట్టిన మణికందన్.. 'విక్రమ్ వేద', 'జై భీమ్' లాంటి హిట్ సినిమాల్లో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు. అలా గత మూడేళ్లలో చూసుకుంటే 'గుడ్ నైట్', 'లవర్'తో రీసెంట్‌గా 'కుడుంబస్థాన్' సినిమాతో వరస హిట్స్ కొట్టేశాడు. అయితే ఇవన్నీ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో తీసినవే. దీంతో ఒకే తరహా చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందించాడు.

(ఇదీ చదవండి: తొలిప్రేమ తోపు కాదు.. ఇంట్రెస్టింగ్ 'చెన్నై లవ్ స్టోరీ')

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మణికందన్.. మిడిల్ క్లాస్ సినిమాలు చేసి తనకు బోర్ కొట్టేసిందని అన్నాడు. గత మూడు చిత్రాలు హిట్ అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ట్రోల్స్ కూడా వచ్చాయనే విషయాన్ని గుర్తుచేశాడు. ఈ ఏడాది ఓ మూడు సినిమాలు చేస్తున్నానని, వచ్చే ఏడాది మరో మూడు చిత్రాల్లో నటిస్తానని.. ఇవన్నీ కూడా తన గత చిత్రాలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయని హామీ ఇచ్చాడు.

మణికందన్ గత మూడు చిత్రాలు నేరుగా తెలుగులో రిలీజ్ కానప్పటికీ.. ఓటీటీ డబ్బింగ్‌తో తెలుగు ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకోవడం విశేషం. 'గుడ్ నైట్' విషయానికొస్తే.. గురక సమస్యతో ఇబ్బందిపడే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు, పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే స్టోరీ. లవర్ విషయానికొస్తే.. ప్రస్తుత సమాజంలోని ప్రేమ, అతిప్రేమ లాంటి అంశాలతో తీసిన సినిమా. కుడుంబస్థాన్ విషయానికొస్తే.. మధ్య తరగతి యువకుడు ఓవైపు జాబ్ చేస్తున్నప్పటికీ ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనుభవించాడనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement