ఆకట్టుకుంటున్న 'మంగంపేట' ఫస్ట్ లుక్.. విజువల్ ట్రీట్‌గా గ్లింప్స్ | Mangampeta Movie Glimpse Out Now | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న 'మంగంపేట' ఫస్ట్ లుక్.. విజువల్ ట్రీట్‌గా గ్లింప్స్

Sep 6 2024 7:20 PM | Updated on Sep 6 2024 8:16 PM

Mangampeta Movie Glimpse Out Now

చంద్రహాస్ కే, అంకిత సాహా కాంబినేషన్‌లో భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మంగంపేట’. గౌతం రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ గ్లింప్స్‌ను రీసెంట్‌గా విడుదల చేశారు.

‘మంగంపేట’ గ్లింప్స్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఇందులోని డైలాగ్స్‌ కూడా బాగా కనెక్ట్‌ అవుతాయి. 'ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’ అంటూ సాగిన డైలాగ్స్.. చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి.

మంగంపేట గ్లింప్స్‌ టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్‌‌లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, మ్యూజిక్ ఢైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement