వారి కష్టాలు, బాధలు చాలా దగ్గరగా చూశా: మంచు మనోజ్‌ ఎమోషనల్ పోస్ట్ | Manchu Manoj Tweet On Stunt Man SM Raju Demise In Movie Set, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

Manchu Manoj: వారి బాధలు చాలా దగ్గరగా చూశా: మంచు మనోజ్‌

Jul 14 2025 9:32 PM | Updated on Jul 15 2025 12:37 PM

Manchu Manoj tweet On Stunt man demise In Movie set

కోలీవుడ్సినిమా షూటింగ్లో స్టంట్మ్యాన్ రాజు మృతిపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విచారం వ్యక్తం చేశారు. అలాంటి వారి బాధలను తాను చాలా దగ్గరగా చూశానని మనోజ్తన బాధను వ్యక్తం చేశారు. వెట్టువం మూవీ సెట్‌లో స్టంట్ లెజెండ్ ఎస్.ఎం.రాజు (మోహన్‌రాజ్) మరణించిన విషయం నాకు ఇప్పుడే తెలిసిందని ట్వీట్ చేశారు. స్టంట్‌మ్యాన్‌ కుటుంబానికి మద్దతుగా ఉంటానని.. ఇలాంంటి విషాద సమయంలో మన పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరుతున్నానంటూ పోస్ట్ చేశారు.

మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..'మూవీ సెట్లో స్టంట్ లెజెండ్ ఎస్.ఎం.రాజు (మోహన్‌రాజ్) విషాదకరంగా మరణించిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గాయాలు జరిగినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు స్టంట్ పెర్ఫార్మర్లు, వారిని ప్రేమించేవారు ఎలాంటి బాధను అనుభవిస్తారో నేను దగ్గరగా చూశా. ఒక స్టంట్‌మ్యాన్‌గా వారి కుటుంబానికి మద్దతుగా మన పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరుతున్నా. మన పనిలో ఉండటం మనకు, మన కుటుంబాలకు అంత సులభం కాదు. మన పరిశ్రమ ధైర్యాన్నిస్తుంది. కానీ ధైర్యం ఎప్పుడూ మన భద్రతను కాపాడలేదు. ప్రతి మూవీ సెట్‌లో శిక్షణ, భీమా, జవాబుదారీతనం, బలమైన ప్రోటోకాల్‌ను యూనియన్లు అమలు చేయాలి. రాజు ప్రాణ త్యాగం మనకు మేల్కొలుపులాంటిది. మన హీరోలను, వారి కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. స్టంట్మ్యాన్రాజు మృతిపై కోలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement