ఓటీటీకి సూపర్ హిట్‌ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

Premalu OTT Release: ఓటీటీకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Apr 2 2024 9:16 PM

Malayalam Super Hit Movie Premalu Streaming On This Ott Paltform - Sakshi

మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్‌ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్స్‌ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం కేవలం మలయాళంలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో ప్రేమలు థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

Advertisement
 
Advertisement