ఆకట్టుకుంటున్న ‘జల్లికట్టు’ | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘జల్లికట్టు’

Published Sat, Jun 25 2022 9:26 PM

Malayalam Movie Jallikattu Dubbed In Tamil Gets Hit Talk - Sakshi

తమిళసినిమా: 2019లో విడుదలై కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుని, ఆస్కార్‌ నామినేషన్‌ వరకు వెళ్లిన మలయాళ చిత్రం జల్లికట్టు. ఇది ఇప్పుడు కోలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. లిజో జోస్‌ బెల్లిసేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్, సెంపన్‌ వినోద్‌ జోస్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గిరీష్‌ గంగాధరన్‌ చాయాగ్రహణను, దీపు జోసెఫ్‌ సంగీతాన్ని అందించారు.

దీనిని ఏఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం ద్వారా అమిత్‌కుమార్‌ అగర్వాల్‌ తమిళంలోకి అనువదించారు. ఈ చిత్రం అమేజాన్‌ ప్రైమ్‌ టైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది ఒక గేదె ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం అని నిర్మాత తెలిపారు. ఒక కుగ్రామంలో కసాయిశాలకు అమ్మడానికి తీసుకొచ్చిన గేదె కట్లు తెంచుకుని పారిపోతుంది. దానిని పట్టుకోవడానికి ఆ గ్రామ ప్రజలంతా చేసే ప్రయత్నమే ఈ చిత్రం అని తెలిపారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement