బహు భాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్(Madonna Sebastian). ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుమ్ కడందు పోగుమ్, కవన్, జూంగా చిత్రాల్లో నటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుదేవా సరసన జాలీ ఓ జింఖానా చిత్రంలో నటించారు. అయితే తన 13 ఏళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. ఏదేమైనా ఎందుకనో అనుకున్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేక పోయారు.

ఇటీవల లియో చిత్రంలో విజయ్‌కు చెల్లెలిగా నటించారు. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇప్పుడు ఏకైక మార్గం గ్లామర్‌గా మారింది. ఇందుకు నటి మడోనా సెబాస్టియన్ అతీతం కాదనిపించారు. ఇటీవల గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో నానుతున్నారు. ఇదే క్రమంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే విమర్శలు హీరోయిన్లకు కొత్తవి కాదు కాబట్టి ఈ అమ్మడు కూడా వాటిని తిప్పి కొడుతున్నారు. పైగా అందాలు ఆరబోత తప్పేమీ కాదు అంటూ సమర్ధించుకుంటున్నారు.
గ్లామర్‌కు అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అని అన్నారు. గ్లామర్‌ను విమర్శించడానికి ఏమీ లేదన్నారు. మొత్తం మీద తను గ్లామర్‌కు గేట్లు తెలిసినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


