'మ్యాడ్' సినిమా.. థియేటర్లలో నవ్వుల హంగామా | Sakshi
Sakshi News home page

MAD Movie: సినిమాకు 'మ్యాడ్' టైటిల్ అలా వచ్చింది

Published Tue, Oct 3 2023 7:10 PM

MAD Movie Trailer And Interview Details - Sakshi

జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'మ్యాడ్'. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రధారులే. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన యాక్టర్స్ పలు ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకున్నారు.

(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!)

ఈ సినిమాలో 'హ్యాపీ డేస్‌' వైబ్స్ కనిపిస్తున్నాయి కదా? అనే ప్రశ్నకు బదులిచ్చిన సంగీత్ శోభన్.. 'హ్యాపీడేస్' రిలీజై 15 ఏళ్లు దాటింది. అది అప్పటి యూత్ సినిమా. కానీ మా చిత్రంలోని కామెడీ ఈ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ని ఎంజాయ్ చేసే ట్రెండ్ ఈ తరానిది. 'మ్యాడ్'లో ఈ తరహా కామెడీ ఉంటుంది. థియేటర్స్‌లో ఫుల్‌ నవ్వులు హంగామా ఉంటుంది.

ఈ సినిమాని 'జాతిరత్నాలు'తో పోల్చుతున్నారనే విషయమై మాట్లాడిన యాక్టర్స్.. జాతిరత్నాలు చిత్రానికి కేవీ అనుదీప్, మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ సంయుక్తంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అలా ఆ పోలిక వచ్చింది. నాగవంశీ కూడా ఈ మూవీ జాతిరత్నాలు తరహాలోనే అందరూ చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని చెప్పారు. దీంతో అందరూ జాతిరత్నాలతో పోల్చారు. మ్యాడ్‌లో అనుదీప్ సరదా పాత్రలో నటించారు. దర్శకుడికి మంచి ఫ్రెండ్ కాబట్టి ఆ రోల్ చేశారు. ప్రేక్షకులను పిచ్చెక్కించే హాస్యం ఉన్నందున 'మ్యాడ్' అని పేరు పెట్టినట్లు రామ్ నితిన్ తెలిపారు. 

(ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి)

Advertisement
 
Advertisement
 
Advertisement