భర్తతో కలిసి ట్రోఫీ గెలిచిన వాసంతి.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? | Mad For Each Other Show Winner Vasanthi Krishnan, Pawan Kalyan | Sakshi
Sakshi News home page

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌'గా వాసంతి జంట.. తట్టుకోలేకపోయిన నటరాజ్‌ మాస్టర్‌!

May 23 2026 1:39 PM | Updated on May 23 2026 2:25 PM

Mad For Each Other Show Winner Vasanthi Krishnan, Pawan Kalyan

పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మందికి ఆశ.. అందులోనూ సెలబ్రిటీలు రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో చూడాలని చాలామంది తహతహలాడుతుంటారు. వారందరి కోసమే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రియాలిటీ షోలు పుట్టుకొస్తున్నాయి. అలా ఎక్కువమందికి దగ్గరైన షో బిగ్‌బాస్‌. ఈసారి కొత్తగా 'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' అనే షో తీసుకొచ్చారు. ఇది మాటీవీతో పాటు హాట్‌స్టార్‌లోనూ ప్రసారమైంది.

10 వారాల రియాలిటీ షో
శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో అనిల్‌ రావిపూడి, రాధ, లయ జడ్జిలుగా వ్యవహరించారు. సీరియల్స్‌, బిగ్‌బాస్‌ ద్వారా ఫేమస్‌ అయిన సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా ఎంచుకున్నారు. అలా 10 సెలబ్రిటీ జంటలను 10 వారాలపాటు ఒక మాన్షన్‌లో ఉంచారు. వారే మహేశ్‌- సాండ్రా, జాను- భాను, వాసంతి కృష్ణన్‌- పవన్‌ కల్యాణ్‌, నటరాజ్‌ మాస్టర్‌- నీతూ, నూకరాజు- ఆసియా, సంధ్య- బ్రిట్టో, హరిత- హరీశ్‌, ప్రియాంక జైన్‌- శివకుమార్‌, అంజలి - పవన్‌, సోనియా- సిద్ధు. 

విజేతగా వాసంతి జోడీ
మధ్యలో అభిమానిక- ఆమిర్‌ దంపతులు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ జంటల మధ్య ప్రేమ, నమ్మకం, సహనాన్ని పరీక్షించారు. ఎన్నో గేమ్స్‌ ఆడించారు. వాటన్నింటినీ దాటుకుని అందరికంటే బలమైన జంటగా నిలిచారు వాసంతి కృష్ణన్‌- పవన్‌ కల్యాణ్‌. ఈ జోడీ మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ట్రోఫీ గెలవడంతో పాటు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంది. రెండో స్థానంలో నూకరాజు, మూడో స్థానంలో మహేశ్‌, ఐదో స్థానంలో జాను దంపతులు నిలిచారు. మొదటి నుంచి గెలుపు నాదే అని ఫిక్సయిన నటరాజ్‌ మాస్టర్‌ నాలుగో స్థానానికి పరిమితమవడంతో హర్టయి ఫినాలే నుంచి వెళ్లిపోయాడు.

 

చదవండి: అమ్మకు క్యాన్సర్‌.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: స్నేహ ఉల్లాల్‌

Advertisement
 
Advertisement
Advertisement