ఫ్యాన్స్‌కు పూనమ్‌ పాండే ఆఫర్‌ | Lock Upp: Poonam Pandey Promises Fans In Reality Show | Sakshi
Sakshi News home page

Poonam Pandey: ఫ్యాన్స్‌కు పూనమ్‌ పాండే ఆఫర్‌

Apr 2 2022 7:46 PM | Updated on Apr 8 2022 3:24 PM

Lock Upp: Poonam Pandey Promises Fans In Reality Show - Sakshi

తాజాగా పూనమ్‌ ప్రేక్షకులకు సంచలన ఆఫర్‌ ఇచ్చింది. తనని నామినేషన్స్‌ నుంచి కాపాడితే బంపర్‌ ఆఫరిస్తానంటూ ప్రామిస్‌ చేసింది.

Lock Upp: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ సో ‘లాకప్‌’. ఇందులో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ షోలో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్‌ ఓ పెద్ద సీక్రెట్‌ బయట పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌ నుంచి సంచలన రహస్యాలను బయటకు వస్తున్నాయి. అది విని నోళ్లు వెళ్లబెట్టడం ప్రేక్షకుల వంతు అవుతోంది. ఈ సీక్రెట్స్‌ పలువురు బాలీవుడ్‌ టీవీ, సినిమా నటినటులకు సంబంధించినవి కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.

ఈ రియాలిటీ షోలో బోల్డ్‌ బ్యూటీ పూనమ్‌ పాండే కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూనమ్‌ ఈ షోలో తన వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్‌ ప్రేక్షకులకు సంచలన ఆఫర్‌ ఇచ్చింది. తనని నామినేషన్స్‌ నుంచి కాపాడితే బంపర్‌ ఆఫరిస్తానంటూ ప్రామిస్‌ చేసింది. ఈ వారం తనని చార్జ్ షీట్‌లోకి వెళ్లకుండా ఓటింగ్‌తో కాపాడాలని ప్రేక్షకులను కోరుతూ.. ఒకవేళ అలా చేస్తే తాను లైవ్‌లో టీ షర్ట్‌ను తొలగిస్తానని కామెంట్స్‌ చేసింది.

చదవండి: రష్మికకు బంపర్‌ ఆఫర్‌, ఐటెం సాంగ్‌ కాదు.. ఏకంగా హీరోయిన్‌ చాన్స్‌..

కాగా ఈసారి పూనమ్‌తో పాటు మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్‌ పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పూనమ్‌ కెమెరాలతో ‘ఇప్పుడు నన్ను చూస్తున్న వారిని నేను కోరేది ఒక్కటే. ఈ వారం చార్జ్‌షీట్ నుంచి నన్ను బయటపడేయండి. నేను మీకు కెమెరా ముందు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇస్తాను’ అని చెప్పుకొచ్చింది.  ఆమె ప్రకటన విన్న సహా కంటెస్టెంట్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో తెలుసుకునేందుకు ఉత్సుకత చూపించారు. అంతేకాదు తన ఆఫర్‌ ఏంటో ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు చెప్పాలంటూ ఆమెకు సవాలు విసిరిరారు.

దీనికి పూనమ్‌ అది సర్‌ప్రైజ్‌ అని, లైవ్‌లోనే చెప్తానని అనడంతో పోటీదారుల్లో ఒకడైన వినీత్‌ కాకర్‌.. ఆమె చెప్పేవన్ని ఒట్టి మాటలే అంటూ విమర్శించాడు. దీనికి పూనమ్‌ స్పందిస్తూ.. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని, ఒకవేళ నన్ను నామినేషన్స్ నుంచి రక్షిస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపింది. దీంతో ఆమె కామెంట్స్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. మరి దీనిపై హోస్ట్‌ కంగనా ఎలా రియాక్ట్‌ అవుతుంది, మరి ప్రేక్షకులు ఆమెను రక్షిస్తారో లేదో వీకెండ్‌ లైవ్‌ షో వరకు వేచి చూడాల్సిందే.

చదవండి: సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్‌డేట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement