
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండు రోజుల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందారు. ఉత్రరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం టన్నెల్ నేడు (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం వాయిదా పడింది. ఈ నెల 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. టన్నెల్ చిత్రం చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందన్నారు.
సంతోషంగా ఉంది
చిత్ర ప్రథమార్థం రొమాంటిక్ సంఘటనలతోనూ, రెండవ భాగం ఎమోషనన్స్ అంశాలతో ఉంటుందని చెప్పారు. సినిమాలో తన పాత్ర సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉంటుందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అంకిత భావంతో పని చేసే హీరో అధర్వతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కెరీర్
లావణ్య త్రిపాఠి 2012లో అందాల రాక్షసి చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత బ్రహ్మ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీ అయ్యారు. కాగా 2017లో మాయాన్ అనే తమిళ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు టన్నెల్ అనే తమిళ చిత్రంలో నటించారు. తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్నై ఫిలిమ్ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎం.జాన్ పీటర్ నిర్మించారు. రవీంద్ర మాదవ దర్శకత్వం వహించారు.
చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?