Krithi Shetty: 'ప్రేమ' గురించి బేబమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Krithi Shetty Intresting Comments On Love - Sakshi

ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం​ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర బృందం.

ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బేబమ్మ  లవ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. మరికొన్నేళ్ల పాటు కెరీర్‌ మీదే దృష్టి పెడతా. ప్రేమ గురించి ఆలోచించేంత సమయం అస్సలు లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతిశెట్టి తెలుగులో సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.చదవండి: విడాకులపై క్లారిటీ ఇచ్చిన యాంకర్‌ సుమ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top