Krishnamraju Daughter Praseedha Gets Emotional While Watching Billa Movie, Goes Viral - Sakshi
Sakshi News home page

Krishnamraju Daughter Emotional: అన్నయ్యను, నాన్నను స్క్రీన్‌పై చూడడం ఆనందంగా ఉంది.. కృష్ణంరాజు కుమార్తె తీవ్ర భావోద్వేగం

Oct 23 2022 6:44 PM | Updated on Oct 23 2022 7:29 PM

Krishnamraju Daughter Praseedha Emotional While Watching Billa Movie Agaian  - Sakshi

టాలీవుడ్‌ యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట‍్రాల్లో సందడి మొదలైంది. పాన్ ఇండియా స్టార్ బర్త్‌డేను పురస‍్కరించుకుని బిల్లా సినిమాను రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు హల్‌చల్‌ చేశారు. ఏపీలోని ఓ థియేటర్లో ఏకంగా బాణాసంచా పేల్చారు. దీంతో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్‌లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. 

ఈ షో చూసేందుకు కృష్ణంరాజు పెద్దకుమార్తె ప్రసీద హాజరయ్యారు. అభిమానుల మధ్య కూర్చొని బిల్లా సినిమాను వీక్షించారు. ఫ్రభాస్ ఫ్యాన్స్‌ మధ్య థియేటర్లో సినిమా చూడడం సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాన్నను, అన్నయ్యను స్క్రీన్‌పై చూడడం చాలా ఆనందాన్నిచ్చిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు.  అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్‌ చేసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

(చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?)

కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద మాట్లాడుతూ...' ప్రభాస్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా మళ్లీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్యను, నాన్నను స్క్రీన్‌పై చూడడం సంతోషం కలిగించింది. మేమందరం చాలా బాగా సినిమాను ఎంజాయ్ చేశాం. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాం. ' అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇటీవలే ప్రభాస్ పెదన్నాన్న కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement