అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ | Khushbu Clarifies her Husband Sundar C is not on any Social Media Platform | Sakshi
Sakshi News home page

Khushbu: రాజకీయాల్లో ఖుష్బూ భర్త.. సోషల్‌ మీడియా ఖాతాలపై క్లారిటీ

Mar 30 2026 12:42 PM | Updated on Mar 30 2026 12:54 PM

Khushbu Clarifies her Husband Sundar C is not on any Social Media Platform

చాలామంది సెలబ్రిటీలు సోషల్‌ మీడియా అంటే తమను జనాలతో కలిపే వారధిగా భావిస్తారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు పెట్టరు. అయితే సెలబ్రిటీల పేరుతో కొందరు ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేస్తుంటారు. ఇప్పుడదే జరిగింది. ఎక్స్‌ (ట్విటర్‌)లో ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్‌ సి పేరిట ఓ అకౌంట్‌ ఉంది. 

త్వరలోనే కొత్తది..
దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఖుష్బూ షేర్‌ చేస్తూ.. అది ఫేక్‌ అకౌంట్‌ అని స్పష్టం చేసింది. తన భర్త ఎటువంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లేడని వెల్లడించింది. కాబట్టి సుందర్‌.సి పేరుపై కనిపించే ఖాతాలను నమ్మవద్దని కోరింది. త్వరలోనే అతడికి ఒక కొత్త అకౌంట్‌ క్రియేట్‌ చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. మొదట్లో డీఎంకేలో చేరింది. నాలుగేళ్లకే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో అడుగుపెట్టింది. 

రాజకీయ ప్రవేశం
ఆరేళ్లకే కాంగ్రెస్‌ను సైతం వీడి బీజేపీలో చేరింది. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ఖుష్బూ భర్త సుందర్‌. సి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి (Puthiya Neethi Katchi (PNK) పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నాడు. మధురై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు.

 

 

చదవండి: ప్రేమిస్తే ఛాన్స్‌ మిస్‌ అయ్యేది.. ముఖానికి గ్రీజు పూసుకోవడంతో..: హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement