Keerthi Suresh: లక్కీ చాన్స్‌ చేజార్చుకున్న కీర్తి సురేశ్‌? ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు!

Is Keerthy Suresh Rejects Mani Ratnam Ponniyin Selvan Movie Offer - Sakshi

దర్శకుడిగా మణిరత్నంకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగ చెప్పనక్కర్లదు.  ఆయన సినిమాలో నటించే చాన్స్‌ కోసం స్టార్‌ హీరోహీరోయిన్లు సైతం ఆశగా ఎదురుచూస్తుంటారు.  ఆయన సినిమాల్లో చిన్న రోల్‌ చేసిన చాలు అని ఎంతోమంది నటీనటులు ఆరాటపడుతుంటారు. అలాంటి స్టార్‌ డైరెక్టర్‌ చాన్స్‌ ఇస్తే ఓ స్టార్‌ హీరోయిన్‌ వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ‘మహానటి’ కీర్తి సురేశ్‌. మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ బృందం నుంచి కీర్తికి పిలుపు అందగా.. డేట్స్‌ లేవని ఆ లక్కీ చాన్స్‌ వదుకుందట కీర్తి.

చదవండి: నయన్‌ బాటలో తమన్నా.. ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చిందంటున్న మిల్కీ బ్యూటీ

తాజాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఇది తెలిసి ఆమె ఫ్యాన్స్‌ అయ్యే అంటుండగా.. మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ‘‘మహానటి’ తర్వాత ఒక్క హిట్‌ కూడా లేని ఆమెకు మణిరత్నం వంటి స్డార్‌ డైరెక్టర్‌ చిత్రంలో అవకాశం వస్తే వదులుకుందా?, చాలా తెలివి తక్కువ వ్యవహరించింది’’అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. కాగా మహానటి చిత్రంతో తన నటనకు గానూ కీర్తి జాతీయ అవార్డు అందుకుంది. ఆ తరువాత ఆమె పలు చిత్రాలలో నటించిన సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో మణిరత్నం చారిత్రక చిత్రం పొన్ని యన్‌ సెల్వన్‌లో నటించే అవకాశం వచ్చింది. 

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల మూవీ షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడే!

అయితే అదే సమయంలో రజనీకాంత్‌కు చెల్లెలిగా అన్నాత్తే చిత్రంలో నటిస్తుండటంతో పాటు మరోవైపు ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుంది. ఇక రజనీకాంత్‌తో నటిస్తే మంచి క్రేజ్‌ వస్తుందని భావించిన కీర్తి తనకు డేట్స్‌ సర్దుబాటు కావడం లేదని చెప్పి మణిరత్నం మూవీకి నో చెప్పిందని సినీవర్గాల నుంచి సమాచారం. దీంతో కీర్తి పాత్రకు త్రిషని తీసుకుందట చిత్ర బృందం. ఇందులో త్రిష కుందనవై అనే రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో త్రిషతో పాటు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, చియాన్‌ విక్రమ్‌, జయం రవి, హీరో కార్తీ వంటి స్టార్‌ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top