Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

Keerthy Suresh to marry her high-school Classmate - Sakshi

నేను శైలజా సినిమాతో టాలీవుడ్‌ ఫేమ్ సాధించిన నటి కీర్తి సురేశ్. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. సావిత్రి బయోపిక్‌లో మహానటి సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది. గతంలో ఓ సంగీత దర్శకుడితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. కీర్తి సురేశ్ దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోను పెళ్లి చేసుకోబోతుందని గాసిప్స్ గుప్పుమన్నాయి.

అయితే ఆమె సన్నిహితులు మాత్రం నటి తన క్లాస్‌మేట్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించారు. వీరిద్దరి వివాహానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. కీర్తి తన క్లాస్‌మేట్‌తో పదమూడు సంవత్సరాలకు పైగా రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నందున పెళ్లిని వాయిదా వేసుకుంది భామ. కాగా.. కీర్తి సురేశ్ క్లాస్‌మేట్‌ కేరళలోని ఓ రిసార్ట్‌  యజమానిగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. 

కీర్తి సురేష్ తర్వాత వెండితెరపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ దసరాతో అలరించనుంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఆమె నేచురల్ స్టార్ నానితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కనిపంచనున్నారు. వీటితోపాటు పలు తమిళచిత్రాల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top