అల్లు అర్జున్‌ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్‌ యంగ్‌ హీరో

Kartik Aaryan Dance To Allu Arjun Butta Bomma Song - Sakshi

టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘బుట్టబొమ్మ’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షార్ట్‌ వీడియో యాప్‌ల ద్వారా దేశంలోని మిగతా భాషల్లోనూ పాపులర్‌ అయిన ఈ పాట సెలబ్రెటీల నుంచి పద్దా, చిన్నా వరకు ఎంతో క్రేజ్‌ను సంపాదించి దాదాపు అందరితోనూ స్టెప్పు లేయించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీలోని ఈ పాటకు తమన్‌ స్వరాలను సమకూర్చగా, బాలీవుడ్‌ సింగర్‌ ఆర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. యూట్యూబ్‌లో 627 మిలియ‌న్ వ్యూస్‌ను దక్కించుకుని ఈ పాట కొత్త రికార్టను సృష్టించింది.

ఇప్పటికే శిల్పాశెట్టి, సిమ్రాన్, దిశా పటానీతో పాటు అస్ట్రేలియన్‌ క్రికెట్‌ డేవిడ్ మొద‌లుకొని ఎంతో మంది బుట్ట బొమ్మకు స్టెప్పులేశారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ కూడా చేరాడు. అయితే ఈ పాటలో సిగ్నేచర్‌ స్టెప్‌తో సహా అల్లు అర్జున్ వేసిన ఏ స్టెప్పులు కార్తీన్ వేయ‌లేదు.  స్ట్రీట్ స్ట‌యిల్ హిప్ హాప్ త‌ర‌హాలో తనదైన శైలిలో కార్తీక్ కార్తీక్‌ ఈ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకన్నాడు. అనంతరం ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేశాడు. దీనికి ‘డాన్స్ లైక్ కార్తీక్ ఆర్య‌న్’ అనే క్యాప్షన్‌తో చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన అతడి ఫాలోవర్స్‌, అభిమానులు, సన్నిహితులు సైతం ఫిదా అయిపోయారు. కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆర్య‌న్ ‘భూల్ భుల‌య్యా-2’ లో న‌టిస్తుండగా, ‘థ‌మాకా’ అనే మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు. 

చదవండి: 
బన్నీ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్‌ ప్రశంసలు

అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డు 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top