హైదరాబాద్‌ ఘటనతో సినిమా | Kareena Kapoor and Ayushmann Khurrana to pair up in Meghna Gulzar's next on 2019 Hyderabad rape case | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఘటనతో సినిమా

Published Tue, Jun 18 2024 2:06 AM | Last Updated on Tue, Jun 18 2024 10:39 AM

Kareena Kapoor and Ayushmann Khurrana to pair up in Meghna Gulzar's next on 2019 Hyderabad rape case

నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ శివార్లలో జరిగిన ఒక హత్యాచార ఘటన వెండితెరపైకి రానుందని టాక్‌. హిందీలో ఈ ఘటన నేపథ్యంలో సినిమా తీయడానికి దర్శకురాలు మేఘనా గుల్జార్‌ సన్నాహాలు మొదలుపెట్టారట. పోలీసులు బాధితురాలి పేరుని వెల్లడించకుండా ‘దిశ’ అని పేర్కొన్న ఆ ఘటన చాలామందికి గుర్తుండే ఉంటుంది.

ఈ చిత్రానికి ముఖ్య తారలుగా కరీనా కపూర్, ఆయుష్మాన్‌ ఖురానాలను ఎంపిక చేశారట మేఘన. కరీనా, ఆయుష్‌ స్క్రిప్ట్‌ చదివి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ‘తల్వార్, రాజీ, చపాక్, సామ్‌ బహదూర్‌’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు మేఘన. దిశ ఘటనపై ఆమె తెరకెక్కించనున్న చిత్రం గురించి త్వరలో అధికారక ప్రకటన రానుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement