ఇందిరా గాంధీ పాత్ర కోసం కంగనా ఇలా...

Kangana Ranaut To Direct Indira Gandhi Biopic Emergency - Sakshi

కెరీర్‌లో మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనున్నారు. సాయి కబీర్‌  ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్‌ పనులను మొదలు పెట్టారు కంగన. లుక్‌ కోసం ప్రోస్థటిక్‌ మేకప్‌ చేయించుకుంటున్నారు. ఈ చిత్రానికి కంగన కూడా ఓ నిర్మాత కావడం విశేషం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో టైటిల్‌ రోల్‌ చేసిన కంగనా రనౌత్‌ వెంటనే ఇందిరాగాంధీ పాత్ర చేయనుండడం మరో విశేషం. ఈ సినిమాలు కాకుండా కంగన ‘ధాకడ్‌’, ‘తేజస్‌’, ‘అపరాజిత అయోధ్య’ చిత్రాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top