
హిందీ నటుడు కమల్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 'చూడటానికి ఇద్దరు వ్యక్తులు కలిసే ఉంటున్నా ఒకే దారిలో వెళ్లలేరు..
Kamal Sadanah to Divorce Lisa John: హిందీ నటుడు, నిర్మాత కమల్ సదన 21 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్య లీసా జాన్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా బతుకుతున్నట్లు వెల్లడించాడు. 'చూడటానికి ఇద్దరు వ్యక్తులు కలిసే ఉంటున్నా ఒకే దారిలో వెళ్లలేరు. ఇలాంటివి చాలాచోట్ల జరుగుతూ ఉంటాయి. అందులో మాది కూడా ఒకటి' అని సింపుల్‌గా చెప్పుకొచ్చాడు. కాగా కమల్, లీసా 2000వ సంవత్సరం జనవరి 1న పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు అంగత్, కూతురు లియా సంతానం. మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న లిసా ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి గోవాలో నివసిస్తున్నట్లు సమాచారం.
1992లో వచ్చిన 'బేఖుడి' సినిమాలో కాజోల్‌కు జోడీగా నటించాడు కమల్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయన 2007లో 'విక్టోరియా నెంబర్ 203: డైమండ్స్ ఆర్ ఫరెవర్' చిత్రంతో నిర్మాతగా మారాడు. అనంతరం 2014లో 'రోర్' సినిమాతో దర్శకుడిగానూ అవతారమెత్తాడు. అభినవ్ శుక్లా,హిమార్ష, సుబ్రత్ దత్త, వీరేంద్ర సింగ్, అలీ ఖలీ మీర్జా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.