పండగకి టైటిల్‌

Kalyan Dev New Movie Opening Ceremony - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు, ‘విజేత’ ఫేమ్‌ కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా నటించనున్న కొత్త చిత్రం హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘అశ్వథ్థామ’ ఫేమ్‌ రమణ తేజ దర్శకత్వం వహించనున్నారు. రామ్‌ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రజనీ తళ్లూరి, రవి చింతల నిర్మిస్తున్నారు. రామ్‌ తళ్లూరి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘సూపర్‌ మచ్చి’ అనే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న కళ్యాణ్‌ దేవ్‌ నటించనున్న మూడో చిత్రమిది.

‘కల్కి’ చిత్రానికి స్టోరీ అందించిన దేశరాజ్‌ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. ‘ఛలో, భీష్మ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహతి సాగర్‌ మా చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకొని సెట్స్‌ మీదకు వెళతాం. దీపావళి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నాం’’ అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో దర్శకులు వెంకీ కుడుముల, ప్రణీత్, వేణు ఊడుగుల పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ రఘుతు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top