నాగార్జునతో కాజల్‌ రొమాన్స్‌

Kajal Agarwal Will Act In Nagarjuna Movie - Sakshi

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున సినిమాల వేగాన్ని పెంచాడు. కరోనా సంక్షోభం నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన  ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా, ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుతో మరో సినిమా మొదలుపెట్టాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్‌ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ పాత్రలో నటించనున్నాడు. ఇందులో నాగార్జున చెల్లిగా చండీఘర్‌ భామ, మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ గుల్‌ పనాగ్‌ నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో తొలిసారి కాజల్‌ అగర్వాల్‌ నాగార్జునకు జోడిగా నటిస్తోంది. టాలీవుడ్‌లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించిన కాజల్, నాగార్జునతో మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో నటించే చాన్స్‌ వచ్చినా.. వదులుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ సారి మాత్రం నాగార్జున సినిమా అనగానే.. కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. మార్చి 31 నుండి హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్‌‌లో కాజల్‌ పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, శరత్ మరార్, పుస్కూరి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
చదవండి:
‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్‌ సినిమా
పాపం 'గాలి సంపత్‌' అప్పుడే ఓటీటీ బాట!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top