ప్రియుడితో పెళ్లి వార్తలు.. తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్! | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్

Published Tue, May 28 2024 10:00 PM

Janhvi Kapoor on rumoured wedding with Shikhar Pahariya

దేవర భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వరుసగా నగరాల్లో పర్యటిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు. తన ప్రియుడు శిఖర్ పహారియాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగారు. దీనికి జాన్వీ కపూర్‌ సైతం నవ్వుతూనే సమాధానమిచ్చింది.  ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

జాన్వీ మాట్లాడుతూ..'ఇటీవల నేను కొన్ని వార్తలు చదివాను,. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. దీంతో నేను పెళ్లి చేసుకుంటున్నట్లు రెండు, మూడు కథనాలు మిక్స్ చేశారు. నాకు తెలియకుండానే.. వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు (నవ్వుతూ). కానీ ప్రస్తుతం నేను ప్రస్తుతానికి కెరీర్‌ పైనే దృష్టి పెడుతున్నా. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు.' అని తెలిపింది. జాన్వీ కపూర్  'మిస్టర్ అండ్ మిసెస్ మహి' మే 31న థియేటర్లలోకి రానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement