RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ బాలీవుడ్‌ సినిమా అన్న నటి, క్లాస్‌ పీకిన నెటిజన్లు

Jane Fonda praises RRR, Calls it Bollywood Film: Netizens Schooled Her - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. కోట్లకు కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను ఎగరేసుకుంటూ ఔరా అనిపిస్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హాలీవుడ్‌ నటి జేన్‌ ఫోండా ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆకాశానికెత్తింది. 'నేను ఇంతకుముందు లెస్లీ సినిమా చూడమని సూచించాను కదా! కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నన్ను ఎంతగానో సర్‌ప్రైజ్‌ చేసింది. బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయింది. సామ్రాజ్యవాదం గురించి సీరియస్‌గా చర్చించిన బాలీవుడ్‌ సినిమా ఇది. చుట్టూ ఉన్న లోకాన్నే మరిచిపోయి సినిమా చూస్తుండిపోయాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది జేన్‌.

దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. 'అమ్మా తల్లి, ఇది బాలీవుడ్‌ సినిమా కాదు, టాలీవుడ్‌ మూవీ' అని కామెంట్లు చేస్తున్నారు. 'ఈ ఫారినర్లు ఇండియన్‌ సినిమా అంటే చాలు బాలీవుడ్‌ అని భ్రమపడుతున్నారు. ఇండియాలో ఎన్నో సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి. టాలీవుడ్‌(తెలుగు), కోలీవుడ్‌(తమిళ్‌), మాలీవుడ్‌(మలయాళం), సాండల్‌వుడ్‌(‍కన్నడ), మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, భోజ్‌పురి, పంజాబీ.. ఇలా అనేకమైన సినీపరిశ్రమలున్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు ఆయా ప్రాంతీయ భాషల్లో సినిమా తీస్తారు. కాబట్టి భారతీయ సినిమా అనగానే దయచేసి బాలీవుడ్‌ అని డిసైడ్‌ చేయకండి' అని సూచిస్తున్నారు. 'ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంపిక కాలేదని , అది దురదృష్టకరమైన విషయం' అని పేర్కొంటున్నారు.

చదవండి: సుశాంత్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన సారా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top