గుంటూరు కారం.. అంతా వేస్ట్‌ అయిపోయింది: జగపతిబాబు | Jagapathi Babu Says He Did not Enjoy Working in Mahesh Babu Guntur Kaaram Movie | Sakshi
Sakshi News home page

Jagapathi Babu: గుంటూరు కారం.. నాకప్పుడే అర్థమైంది.. వేస్ట్‌!

Apr 8 2024 3:45 PM | Updated on Apr 8 2024 5:52 PM

Jagapathi Babu Says He Did not Enjoy Working in Mahesh Babu Guntur Kaaram Movie - Sakshi

గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్‌ చేయలేదు. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్‌గా ఉండాల్సింది. క్యారెక్టర్లను ఇంకా మెరుగ్గా రాసుకోవాల్సింది. కానీ కొంతకాలానికే అం

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతికి రిలీజైంది. సరిగ్గా అప్పుడే చిన్న చిత్రం హనుమాన్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం చిత్రాన్ని వెనక్కు నెడుతూ హనుమాన్‌ సూపర్‌ డూపర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మహేశ్‌ సినిమాకు కలెక్షన్స్‌ అయితే చూపెట్టారు కానీ అదే సమయంలో నెగెటివిటీ కూడా వచ్చింది. ఈ మూవీలో జగపతిబాబు విలన్‌గా నటించాడు.

నిజం చెప్తున్నా
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేశ్‌బాబుతో పని చేయడం నాకెంతో ఇష్టం. కానీ నిజాయితీగా చెప్తున్నా.. గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్‌ చేయలేదు. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్‌గా ఉండాల్సింది. క్యారెక్టర్లను ఇంకా మెరుగ్గా రాసుకోవాల్సింది. కానీ కొంతకాలానికే అంతా గందరగోళంగా మారింది. దీంతో సినిమా పూర్తి చేయడం కష్టమైంది.

వేస్ట్‌
నేను చేయాల్సింది చేశాను. కానీ.. మహేశ్‌తో నా కాంబినేషన్‌ ఎప్పుడూ గొప్పగా ఉండాలనుకుంటాను. ఇలాంటి సినిమాల కోసం మా కాంబినేషన్‌ను వేస్ట్‌ చేయాలనిపించదు' అని చెప్పుకొచ్చాడు. జగపతిబాబు ప్రస్తుతం మిస్టర్‌ బచ్చన్‌, పుష్ప 2 సినిమాలు చేస్తున్నాడు. అలాగే తమిళంలో కంగువా, హిందీలో రుస్లాన్‌ సినిమాల్లో కనిపించనున్నాడు.

చదవండి: ఒకప్పుడు రూ.500 అద్దె.. ఇప్పుడదే ఇల్లు కోరుకుంటున్న హీరో

Advertisement
 
Advertisement
Advertisement