'కూతురు ప్రేమంటే ఏంటో ఈ వీడియో చూస్తే చాలు' | Jabardasth Actress Rithu Chowdary Shares Emotional Video About Father | Sakshi
Sakshi News home page

Rithu Chowdary: నవ్వు లేని లోకాన్ని ఊహించలేకపోతున్నా: రీతూ చౌదరి ఎమోషనల్

Published Tue, Jan 24 2023 5:59 PM | Last Updated on Tue, Jan 24 2023 7:34 PM

Jabardasth Actress Rithu Chowdary Shares Emotional Video About Father - Sakshi

జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి తండ్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనలైంది రీతూ. నువ్వు లేని లోకంలో ఉండలేక పోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. తండ్రితో కలిసి చేసిన రీల్స్‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన సందేశం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు మేమంతా ఉ‍న్నాం.. ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

రీతూ చౌదరి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'డాడీ.. ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు. నువ్వు లేని లోకాన్ని ఊహించలేకపోతున్నా. నాపై నీ ప్రేమను ఇంకెవరూ చూపించలేరు. నేను అలిగితే బతిమాలుతావు. నాకు చిరాకు, కోపం పడినా మళ్లీ నవ్విస్తావ్. ఎవరైనా నన్ను ఒకమాట అంటే తిట్టేవాడివి. అలాంటి నన్ను వదిలి ఎలా వెళ్లిపోయావు. నాకు నువ్వే అన్నం తినిపించేది. నన్ను మోటివేట్ చేసేది. నువ్వు, నేను కలిసి రీల్స్ చేసేది. నువ్వు తిరిగిరా డాడీ.. నువ్వు చెప్పినట్లు వింటాను. నీ కూతురును పులి అన్నావ్. మళ్లీ పులిని ఎలా వదిలి వెళ్లిపోయావ్. అమ్మా, అన్న నిన్ను తలుచుకుంటూనే ఉన్నారు. ప్లీజ్ రా డాడీ.' అంటూ వీడియో పోస్ట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement