'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ | House Of The Dragon Season 2 Trailer And Series Release Date Details Inside | Sakshi
Sakshi News home page

House Of Dragon Season 2: 'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్

Published Wed, May 15 2024 2:27 PM

House of the Dragon Season 2 Trailer And Series Details

ప్రపంచంలోనే అద్భుతమైన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టాప్‌లో ఉంటుంది. 2011-18 మధ్య దాదాపు ఎనిమిది సీజన్లు వస్తే అవన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీనికి ప్రీక్వెల్‌గా 'హౌస్ ఆఫ్ డ్రాగన్' పేరుతో మరో సిరీస్ తీస్తే అది కూడా హిట్ అయింది. 2022లో తొలి సీజన్ రిలీజ్ కాగా, త్వరలో రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేయగా, అది అంచనాల్ని పెంచేస్తోంది.

(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)

'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' రెండో సీజన్‌లో మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. జూన్ 16 నుంచి ఒక్కో వారం ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేయనున్నారు. హెచ్‌బీవో మ్యాక్స్, జియో సినిమా ఓటీటీల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే తొలి సీజన్ చూసిన ప్రేక్షకులు.. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)

Advertisement
 
Advertisement
 
Advertisement