అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ‘ఫ్రెండ్లీ ఘోస్ట్’ | Hero Manchu Manoj Unveils First Look Of Friendly Ghost Movie | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ‘ఫ్రెండ్లీ ఘోస్ట్’

Aug 16 2025 2:18 PM | Updated on Aug 16 2025 3:03 PM

Hero Manchu Manoj Unveils First Look Of Friendly Ghost Movie

మంచు మనోజ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

సత్యం రాజేష్ , రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్రెండ్లీ ఘోస్ట్.  సస్పెన్స్ తో పాటు కామిడికి పెద్ద పీట వేస్తూ దర్శకుడు జి.మధు సూధన్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ... "మంచి కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఫ్రెండ్లి ఘోస్ట్ సినిమా త్వరలో థియేటర్స్ లో రాబోతోంది. ఈ సినిమా విజయం సాధించి హీరో రాజేష్ కు నిర్మాత విశ్వనాథ్‌కి, డైరెక్టర్ జి.మధు సూధన్ రెడ్డికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా" అన్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, మధు నందన్, చమ్మక్ చంద్ర, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ త్వరలో రాబోతున్నాయి. ఆడియన్స్ కు తప్పకుండా ఫ్రెండ్లీ ఘోస్ట్ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement