Rakul Preet Singh: చేయాలనుకున్నవే చేస్తున్నా! | Grateful to get the opportunity to choose contrasting roles | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: చేయాలనుకున్నవే చేస్తున్నా!

May 25 2021 12:48 AM | Updated on May 25 2021 7:41 AM

Grateful to get the opportunity to choose contrasting roles - Sakshi

కెరీర్‌లో కొంతదూరం ముందుకు వెళ్లిన తర్వాత ఒకరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమాలు చేశానని నాకు సంతృప్తి కలగాలి..

సినిమాల్లో తాను పోషించే పాత్రల మధ్య భిన్నత్వాన్ని ప్రదర్శించే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం తనకు లభిస్తున్న పాత్రల గురించి రకుల్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల్లోని పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులు కూడా చూసిన పాత్రల్లో చూడాలని అనుకోవడంలేదు. నేనూ చేసిన పాత్రలే చేయాలనుకోను. చేయాలనుకున్నవే చేస్తున్నాను. అయితే నేను ఏ పాత్రలు చేయాలనుకుంటున్నానో అవే వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

కెరీర్‌లో కొంతదూరం ముందుకు వెళ్లిన తర్వాత ఒకరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమాలు చేశానని నాకు సంతృప్తి కలగాలి. ఇందుకోసమే ప్రయత్నిస్తున్నాను’’ అని పేర్కొన్నారు రకుల్‌. మరాఠీ దర్శకుడు తేజస్‌ దియోస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో కండోమ్‌ టెస్టర్‌ పాత్ర చేయనున్నారు రకుల్‌. ‘‘కొన్ని సమస్యలను సున్నితంగానే హైలైట్‌ చేయాలి. దర్శకుడు చెప్పిన స్టోరీలైన్, నా పాత్ర నచ్చడంతో ఈ సినిమా అంగీకరించాను. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టాలని అనుకుంటున్నాం’’ అని రకుల్‌ అన్నారు. ఆయుష్మాన్‌ ఖురానా ‘డాక్టర్‌ జీ’, జాన్‌ అబ్రహాం ‘ఎటాక్‌’, అజయ్‌ దేవగన్‌ ‘మేడే’, ‘థ్యాంక్‌ గాడ్‌’ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బీ టౌన్‌లో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు రకుల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement