
ఉత్తరాంధ్రలో బుర్రకథలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నారు. అదే 'గరివిడి లక్ష‍్మి'. పీపుల్స్ మీడియా నిర్మాణంలో తీస్తున్న ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు చిత్రంలోని ఫేమస్ హిట్ సాంగ్ అయిన 'నల జీలకర్ర మొగ్గ' వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
(ఇదీ చదవండి: క్రేజీ హారర్ కామెడీ.. 'సు ఫ్రమ్ సో' ట్రైలర్ రిలీజ్)
ఆనంది, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జమ్ము నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'నల జీలకర్ర మొగ్గ' వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో ఆనంది డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.
(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)