‘బంగార్రాజు’ మూవీ స్పెషల్‌ సాంగ్‌ వచ్చేసింది | Faria Abdullah Special Song From Bangarraju Movie Released | Sakshi
Sakshi News home page

Bangarraju: ‘బంగార్రాజు’ మూవీ స్పెషల్‌ సాంగ్‌ వచ్చేసింది

Dec 20 2021 8:08 AM | Updated on Dec 20 2021 8:21 AM

Faria Abdullah Special Song From Bangarraju Movie Released - Sakshi

అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది క్యాప్షన్‌.  డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా రూపొందుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. నాగ చైతన్య, నాగార్జునలకు సంబంధించిన ఓ స్పెషల్‌ సాంగ్‌ ప్రొమోను ఆదివారం విడుదల చేశారు. 

చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్‌ లుక్‌, ఈ రేంజ్‌లో గ్లామర్ ఇచ్చిందా!

‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ సాగే ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ఇటీవల ఈ సాంగ్‌ ప్రొమోను విడుదల చేస్తూ ఫుల్‌ సాంగ్‌ డిసెంబర్‌ 19న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్‌ సాంగ్‌లో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబద్దుల్లా కనువిందు చేయగా.. ఆమెతో కలిసి నాగ్‌, చై స్టెప్పులు వేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ మూవీ సీనియర్‌ నటి రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నటిస్తున్నారు. అలాగే చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement