‘‘గాయపడ్డ సింహం’ చిత్ర కథ వినగానే కొత్తగా అనిపించింది. కశ్యప్ శ్రీనివాస్‌గారు నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇందులో ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉంటుంది. నేను చేసిన షాలిని పాత్రలో వినోదం ఎక్కువగా ఉంటుంది. మా మూవీ చూసిన ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే సంతృప్తి కలుగుతుంది’’ అని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చెప్పారు.
తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా పంచుకున్న విశేషాలు....
⇒ నేను ఏదైనా ఓ సినిమా ఒప్పుకోవాలంటే కథ, నా పాత్ర నచ్చాలి. ‘గాయపడ్డ సింహం’లో వ్లాగర్ షాలిని పాత్ర చేశాను. కశ్యప్ క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్‌గా వచ్చాయి. మా మూవీ ఫైనల్ ఔట్‌పుట్ చూశాను.. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తరుణ్ భాస్కర్‌గారు సరదాగా ఉంటారు. ఆయన సెట్స్‌లో చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేది. ఈ మూవీలో శ్రీవిష్ణుగారి క్యారెక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ప్రేమికుడి చేయి వదిలేసిన అమ్మాయిగా మానసా చౌదరి చేస్తే.. ఆ చేతిని పట్టుకునే అమ్మాయి పాత్ర నాది (నవ్వుతూ).
⇒ ‘గాయపడ్డ సింహం’ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కలిపి హిలేరియస్‌గా తెరకెక్కించారు కశ్యప్ శ్రీనివాస్‌గారు. స్వీకర్ అగస్తి చాలా అందమైన సంగీతం ఇచ్చారు. ‘బ్రైడ్...’, ‘జింగాల...’ నాకు ఇష్టమైన పాటలు. ఈ చిత్రానికి నలుగురు నిర్మాతలు ఉన్నారు.. అందరూ చాలా క్రియేటివ్‌గా ఆలోచించే వారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తిగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. దుల్కర్ సల్మాన్‌గారి సినిమాలో అతిథి పాత్ర వస్తే చేయాలనుకోవడం లేదు. పూర్తి స్థాయి నిడివి ఉండే పాత్ర చేయాలని ఉంది. వచ్చే ఏడాది నేను ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తాను.. కొన్ని కథలు రాస్తున్నాను. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ సినిమాలు పూర్తి చేశాను. సత్యదేవ్‌గారితో ఓ మూవీ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి.


