ప్రేమ కోసం ఏదైనా..  | Everything For Love Movie By Director Santhosh Parlawar | Sakshi
Sakshi News home page

ప్రేమ కోసం ఏదైనా.. 

Aug 5 2020 3:27 AM | Updated on Aug 5 2020 4:11 AM

Everything For Love Movie By Director Santhosh Parlawar - Sakshi

వంశీకృష్ణ, ఆనంద్‌ కుమార్, వికాస్‌ చంద్ర హీరోలుగా, ఉషా, రూపాలి సెలోకర్, ఏంజెల్‌ గరేవాల్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రియతమా’. ‘ఎనీథింగ్‌ ఫర్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. సంతోష్‌ పార్లవార్‌ దర్శకత్వం వహించారు. కర్నూలుకు చెందిన ప్రముఖ నాయకుడు పులకుర్తి కొండయ్య ఆర్‌కె టాకీస్‌ పతాకంపై నిర్మించారు. నేడు (ఆగస్టు 5) కొండయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయాలని తొలి ప్రయత్నంగా ‘ప్రియతమా’ చిత్రాన్ని నిర్మించాను. యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సామాజిక సందేశాన్ని అందించే చిత్రాలతోపాటు పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రాల్ని నిర్మించాలనుకుంటున్నాం. ‘ప్రియతమా’ చిత్రాన్ని ఓటీటీలో  విడుదల చేసేందుకు సన్నాహాలు చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, కెమెరా: ఆనెం వెంకట్‌. 

Advertisement
 
Advertisement
Advertisement