ఓటీటీలో దుల్కర్‌ సల్మాన్‌ యాక్షన్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే? | Dulquer Salmaan King of Kotha Hindi Version OTT Release Date Out | Sakshi
Sakshi News home page

King of Kotha: ఎట్టకేలకు ఓటీటీలోకి కింగ్‌ ఆఫ్‌ కొత్త హిందీ వర్షన్‌.. ఎప్పుడు? ఎక్కడంటే?

Oct 15 2023 3:35 PM | Updated on Oct 15 2023 4:25 PM

Dulquer Salmaan King of Kotha Hindi Version OTT Release Date Out - Sakshi

బాక్సాఫీస్‌ దగ్గర మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీ మినహా మిగతా అన్ని భాషల్లో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన యాక్షన్‌ మూవీ కింగ్‌ ఆఫ్‌ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్‌ అని అర్థం. దీన్ని యథాతథంగా తెలుగులో అదే పేరుతో రిలీజ్‌ చేశారు. అభిలాష్‌ జోషి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఆయా భాషల్లో దుల్కరే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నాడు.

ప్రేమకథల్లో దుల్కర్‌ను చూసి అలవాటుపడిపోయిన అభిమానులు ఈ యాక్షన్‌ మూవీని ఆదరించలేదు. బాక్సాఫీస్‌ దగ్గర మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీ మినహా మిగతా అన్ని భాషల్లో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.

తాజాగా హిందీ వర్షన్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది చిత్రయూనిట్‌.. ఇతర భాషల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కింగ్‌ ఆఫ్‌ కొత్త హిందీ భాషలో అక్టోబర్‌ 20 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించింది. 20 రోజులు ఆలస్యంగా హిందీ వర్షన్‌ ఓటీటీలోకి వస్తోంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్‌ మొత్తానికి హిందీ వర్షన్‌ డేట్‌ ప్రకటించారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: హీరోయిన్‌తో లిప్‌లాక్‌.. నాని ఇంట్లో గొడవలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement