Raghavendra Rao: తొలిసారి నటుడిగా మౌనముని

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి 'పెళ్లి సందD' సినిమాతో వెండితెరపై కనిపించబోతున్నారు. రాఘవేంద్రరావు పర్యవేక్షనలో గౌరీ రోనంకి దర్శకత్వంలో 'పెళ్లి సందD' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాలో రాఘవేంద్రరావు 'వశిష్ట' అనే పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా రాఘవేంద్రరావు పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ వీడియోను డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు లుక్ ఆకట్టుకుంటుంది. సూటు, బూటు ధరించి గాగుల్స్ పెట్టుకొని యమ స్టైలిష్‌గా కనిపించారాయన. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇంత కాలం...కెమెరా వెనుక ఉండి చూపించిన దర్శకేంద్రుడి మాయ ఇప్పుడు కెమెరా ముందు చూడబోతున్నాం... 🙏....@Ragavendraraoba గురూజీ....మళ్ళీ ఈ "పెళ్లి సందడి" మరో సంచలనం అవ్వాలని కోరుకుంటున్నాను 😍🎉🎉🎉
All the best to whole team ....💐💐 https://t.co/lV3Y6oT4UD— Anil Ravipudi (@AnilRavipudi) July 30, 2021