
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. మానగరం, ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ కొట్టి ఇతడు ఇటీవలే కూలీ సినిమా తెరకెక్కించాడు. రజనీకాంత్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన ఈ మూవీ దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసింది.
ఆయన లేకుండా సినిమా చేయను
తాజాగా ఈయన కోయంబత్తూరులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ సంచలన ప్రకటన చేశాడు. మీ సినిమాల్లో సంగీతం కోసం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయం కోరతారా? అన్న ప్రశ్నకు లోకేశ్ ఇలా స్పందించాడు. నేను అనిరుధ్ లేకుండా ఏ సినిమా చేయను. ఒకవేళ అతడు సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటే అప్పుడు ఏఐ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు లేవు అని చెప్పాడు.

అది జరగకుండానే డైరెక్టర్ అయిపోయా
ఇదే సదస్సులో లోకేశ్ ఇంకా మాట్లాడుతూ.. నేను రూ.4వేలతో షార్ట్‌పిలిం చేశా. కెమెరా ఎవరిదగ్గరైతే ఉందో వాడే సినిమాటోగ్రాఫర్, ల్యాప్‌టాప్ ఉన్నవాడే ఎడిటర్. కాబట్టి ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్‌లు అవసరం లేదు. ఎవరైనా దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేయాలనుకున్నాను. కానీ అది జరగకుండానే డైరెక్ట్ అయిపోయాను అని చెప్పుకొచ్చాడు. కాగా లోకేశ్ తెరకెక్కించిన మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలకు అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహించాడు.
Director #LokeshKanagaraj drops a BIG STATEMENT! 😮
"In future as well, I wouldn't do any films without @anirudhofficial"
pic.twitter.com/nTicUPOWCZ— Anirudh FP (@Anirudh_FP) September 1, 2025
చదవండి: బిపాసా బసు వివాదం.. మరో స్టార్ హీరోయిన్‌పై మృణాల్ ఠాకూర్