
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ నటి బిపాసా బసును ఉద్దేశించి గతంలో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. దీంతో మృణాల్ ఠాకూర్పై నెటిజన్స్తో పాటు బాలీవుడ్కు చెందిన పలువురు సినీస్టార్స్ సైతం స్పందించారు. ఆ తర్వాత ఆ వయసులో తెలియక అలా మాట్లాడానని.. ఎవరినైనా బాధపెట్టి ఉండే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. దీంతో ఆ వివాదానికి అక్కడితో ఫుల్స్టాప్ పడింది.
అయితే మృణాల్ ఠాకూర్ సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్లో తాను నటించాల్సిన సినిమా గురించి అందులో మాట్లాడింది. ఆ మూవీని తాను తిరస్కరించినట్లు మృణాల్ తెలిపింది. ఒకవేళ నేను ఆ చిత్రంలో చేసి ఉంటే.. నన్ను నేను కోల్పోయేదాన్ని అంటూ కామెంట్స్ చేసింది. కానీ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నా స్థానంలో నటించిన ఆమెకు స్టార్డమ్ను తీసుకొచ్చిందని మృణాల్ ఠాకూర్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలు చేయట్లేదని పేర్కొంది.

ఆ సినిమా పేరు చెప్పకపోయినప్పటికీ నెటిజన్స్ మాత్రం మృణాల్ ఠాకూర్పై మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా గురించే మాట్లాడారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్గా అనుష్క శర్మ నటించారని.. ఆమెను అవమానపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్స్ మరోసారి ఫైరవుతున్నారు. ఆ సినిమాలో చేసినందుకు ఇప్పుడు అనుష్క శర్మ నటించడం లేదని.. ఆమెను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇటీవలే బిపాసా బసుపై కామెంట్స్తో వివాదానికి కారణమైన సీతారామం బ్యూటీ.. మరోసారి బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది.