10 ఏళ్ల తర్వాత హిట్‌ మూవీకి సీక్వెల్‌.. తెలుగు హీరోయిన్స్‌తో | Director Ezhil, Actor Vimal Desingu Raja Sequel Announced | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో హిట్‌ మూవీ.. 10 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు రెడీ

Published Sat, Jan 13 2024 12:41 PM | Last Updated on Sat, Jan 13 2024 12:56 PM

Director Ezhil, Actor Vimal Desingu Raja Sequel Announced - Sakshi

దర్శకుడు ఎస్‌.ఎళిల్‌...  విజయ్‌ హీరోగా 'తుళ్లాద మనం తుళ్లుమ్‌', అజిత్‌ కథానాయకుడిగా 'పూవెల్లా ఉన్‌ వాసన్‌', రాజా, ప్రభుదేవా హీరోగా 'పెన్నిన్‌ మనదై తొట్టు', జయంరవితో 'దీపావళి', విష్ణువిశాల్‌ హీరోగా 'వేలన్ను వందుట్టా వేళైక్కారన్‌' వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ఆ తరువాత విమల్‌ కథానాయకుడిగా దేసింగురాజా చిత్రాన్ని రూపొందించాడు. 10 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా దేసింగురాజు –2 రూపొందుతోంది. ఎస్‌.ఎళిల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మరోసారి విమలే కథానాయకుడిగా నటిస్తున్నారు. అలా ఈ సక్సెస్‌ కాంబో మరోసారి రిపీట్‌ అవుతోంది. ఎళిల్‌ తన చిత్రాల్లో వినోదానికి పెద్ద పీట వేస్తాడు. పి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి ఐనా కీలక పాత్రను పోషిస్తున్నారు. పూజిత పొన్నాడ, హర్షిత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సూరి, యోగిబాబు, రవి మరియ, రోబో శంకర్‌, సింగం పులి, మొట్టై రాజేంద్రన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేర్వేరు బాటల్లో పయనించే నలుగురు కళాశాల విద్యార్థుల ఇతివృత్తంతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దేసింగురాజు –2 ఉంటుందని దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. ఆర్‌.బాలకుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం..!

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement