11 ఏళ్లకే ఇంట్లో నుంచి పంపించేశారు: నటుడు | Diljit Dosanjh: My Connection with Parents Broke when I was 11 | Sakshi
Sakshi News home page

Diljit Dosanjh: 11 ఏళ్లకే పేరెంట్స్‌కు దూరమయ్యా.. నాన్న ఏనాడూ పట్టించుకోలే!

Apr 4 2024 5:26 PM | Updated on Apr 4 2024 5:52 PM

Diljit Dosanjh: My Connection with Parents Broke when I was 11 - Sakshi

వెళ్లడం ఇష్టమేనా? అని నన్ను ఒక్క మాటైనా అడగలేదు. అక్కడికి వెళ్లాక ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడిని. టీవీ ఉండేది కాదు. అప్పుడు ఫోన్లు కూడా లేవు. అలా నా కుటుంబా

బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్‌ దోసాంజ్‌. తర్వాత ఆ గొంతే అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అతడు నటించిన అమర్‌ సింగ్‌ చంకీలా (అమర్‌ సింగ్‌ చంకీలా బయోపిక్‌) సినిమా ఏప్రిల్‌ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు.

ఒక్కమాటైనా అడగలేదు
'11 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నా తల్లిదండ్రులను, ఊరిని వదిలేసి మా మామతో లూథియానాకు వెళ్లిపోయాను. అతడు నన్ను తనతో పంపించమని అడగ్గానే అమ్మానాన్న నాకు మంచి ఫుడ్‌, షెల్టర్‌ దొరుకుతుందన్న ఆశతో వెంటనే తీసుకెళ్లిపోమని చెప్పారు. వెళ్లడం ఇష్టమేనా? అని నన్ను ఒక్క మాటైనా అడగలేదు. అక్కడికి వెళ్లాక ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడిని. టీవీ ఉండేది కాదు. అప్పుడు ఫోన్లు కూడా లేవు. అలా నా కుటుంబానికి నేను పూర్తిగా దూరమయ్యాను. నేను ఏ స్కూల్‌లో చదువుతున్నానని కూడా నాన్న అడిగేవారు కాదు. అందరితో నా సంబంధాలు తెగిపోయాయి. 

అమ్మ మాటలు వింటే..
తర్వాత నేను ఫోన్‌ చేసినప్పుడల్లా కాల్‌ కట్‌ చేసేముందు అమ్మ నన్ను ఆశీర్వదించేది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవించగానే అన్ని టెన్షన్లు ఎగిరిపోయేవి. ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించేది. తన మాటలతో నాపై ప్రేమవర్షం కురిపించేది. ఆ దేవుడి కంటే కూడా నాకు మా అమ్మే ఎక్కువ' అని చెప్పుకొచ్చాడు. దిల్జిత్‌ ఇటీవల క్య్రూ సినిమాలో కనిపించాడు.

చదవండి:  ఆ సీన్‌ చేయనని ఏడ్చేసిన హీరోయిన్‌.. విలన్‌గా అది తప్పదన్న నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement