
తన హక్కులకు రక్షణ కల్పించాలంటూ తెలుగు హీరో నాగార్జున.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని పేర్కొంది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.
(ఇదీ చదవండి: శుభవార్త.. నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్)
అయితే నాగార్జున ఫొటోని, గాత్రాన్ని అభ్యంతర కంటెంట్‌తో పాటు నకిలీ ఎండోర్స్‌మెంట్, టీ షర్ట్స్ తదితర వ్యాపారాల్లో.. యూట్యూబ్ షార్ట్స్‌లోనూ ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారని నాగ్ తరఫు న్యాయవాదాలు.. ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నాగ్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఇక మీదట సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాగార్జున హక్కులకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలకు న్యాయస్థానం ఆదేశించింది. నాగార్జున ఇప్పుడు ఇలా చేయడంతో ముందు ముందు ఇతర సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు విషయమై ఇదే దారిలో వెళ్తారని అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)