Deepika Padukone: దీపికాకు గ్లోబల్‌ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌

Deepika Padukone wins Global Achievers Award for Best Actress with Barack Obama and Jeff Bezos - Sakshi

బాలీవుడ్‌లో అందంతోపాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే. రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, `పద్మావత్` వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ తాజాగా అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ‘ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021’ ని దక్కించుకుంది.

ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000 వేలపైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపికా అవార్డు సాధించింది. ఈ అవార్డుకు అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా, బిజినెస్‌మెన్‌ జెఫ్‌ బెజోస్‌, క్రీడాకారుడు క్రీస్టీనో రోనా​ల్డో లాంటి హేమహేమీలతో కలిసి ఎంపికయ్యింది. కాగా ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన  తొలి ఇండియన్‌ దీపికే కావడం విశేషం. అయితే ఈ భామ ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘ఫైటర్‌’, అమితాబ్‌తో కలిసి ‘ది ఇంటర్న్‌’, తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘83’, మరి కొన్నిహాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

చదవండి: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్‌ నటుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top