గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ | Deepika Padukone Ranveer Singh confirm second pregnancy with a cute pic | Sakshi
Sakshi News home page

Deepika Padukone: దీపికా-రణ్‌వీర్ జంట గుడ్ న్యూస్.. రెండోసారి ప్రెగ్నెన్సీ

Apr 19 2026 11:35 AM | Updated on Apr 19 2026 12:33 PM

Deepika Padukone Ranveer Singh confirm second pregnancy with a cute pic

దీపికా పదుకొణె, రణ్‌ వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము రెండో బిడ్డ కోసం  ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. రెండోసారి దీపికా ప్రెగ్నెన్సీతో ఉందన్న శుభవార్తను పంచుకున్నారు. ఓ క్యూట్ పిక్‌ షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ముద్దుల కూతురు దువా పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు.

కాగా.. వీరిద్దరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకు దువా అని నామకరణం చేశారు. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న దీపికా, రణవీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలో ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే రణ్‌వీర్ ప్రస్తుతం 'ధురందర్ 2' మూవీతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తోంది. ఇకపోతే దీపిక సైతం చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆమె ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన 'కింగ్' చిత్రంలో నటించనుంది. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో రాకా మూవీలోనూ హీరోయిన్‌గా కనిపించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement