సీక్వెల్‌ కోసం వెంకటేశ్‌– అనిల్‌ రావిపూడి ప్లాన్‌ | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ కోసం వెంకటేశ్‌– అనిల్‌ రావిపూడి ప్లాన్‌

Published Sat, Feb 3 2024 3:39 AM

Deadly combination: Venkatesh and Anil Ravipudi upcoming movie - Sakshi

‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాల (వరుణ్‌ తేజ్‌ మరో హీరో) కోసం కలిసి పని చేసిన హీరో వెంకటేశ్‌–దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో మరో మూవీ తెరకెక్కనుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అనిల్‌ రావిపూడి ఓ కథను వెంకటేశ్‌కు వినిపించారట. ఈ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ‘దిల్‌’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.

అయితే వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లోని సినిమా ‘ఎఫ్‌ 4’ అవుతుందా? లేక వేరే కొత్త కథా? అనే విషయాలపై స్పష్టత రావాల్సింది. మరి... వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడిల కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా సెట్స్‌ పైకి వెళ్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
 
Advertisement
 
Advertisement